అరుంధతిగా,దేవసేనగ, భాగమతి గా ప్రేక్షకులను మెప్పించిన నటి అనుష్.క ఒకవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం సినిమా చేస్తోంది. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. నిజానికి లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటున్నారు. కానీ అనుష్క మాత్రం సోషల్ మీడియా వాడకం లో కాస్త వెనుకంజలో ఉందని చెప్పాలి.
ప్రస్తుతం ఆమె ఇంస్టాగ్రామ్ మాత్రమే వాడుతున్నారు. ఇదే విషయమై ట్విట్టర్ లోకి ఎప్పుడు వస్తారు అంటూ అభిమానులు ప్రశ్నించగా నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. సెట్ లోకి వెళితే అన్ని మర్చిపోతా..కానీ కొత్తవాళ్లతో అంత తొందరగా కలవలేను. సినిమాలు లేకపోతే నా ఇల్లే లోకం. అభిమానులు ఎప్పటి నుంచో లోకి ట్విట్టర్ లోకి రమ్మని పిలుస్తున్నారు. నిజానికి దీని గురించి నేను ఇంకా అవగాహన పెంచుకోవాలి. ఏదైనా చెప్పాలని నా మనసు కు అనిపించినప్పుడు తప్పక వస్తాను. ఆ తర్వాత అభిమానులు అందరికీ ఎప్పుడూ టచ్ లోనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.