బాలీవుడ్ నటి అనుష్క శర్మ 2008లో ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్‌తో కలిసి రబ్ నే బనాదీ జోడీ సినిమాలో నటించిన విషయం విదితమే. ఆ సినిమా ద్వారా అనుష్క శర్మ బాలీవుడ్ తెరకు పరిచయం అయింది. తరువాత ఎన్నో మూవీల్లో నటించింది. అనంతరం ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని వివాహం చేసుకుంది. అయితే ఆమె సినిమాల్లోకి రాక ముందు మోడల్‌గా చేసింది. అలాగే అనేక యాడ్స్ లో నటించింది. ఈ క్రమంలోనే ఆమె అప్పట్లో నటించిన ఒక యాడ్‌కు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనుష్క శర్మ ఓ కంపెనీకి చెందిన హెయిర్ ప్రొడక్ట్‌లో నటించిన యాడ్ అది. అందులో అనుష్క శర్మను, ఇప్పటి అనుష్క శర్మను చూసి నెటిజన్లు ఆమెను పోల్చుకోలేకపోతున్నారు. అప్పటి ఆమెకు, ఇప్పటి ఆమెకు ఎంతో తేడా ఉంది. అసలు ఆమెను గుర్తు పట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ యాడ్‌లో ఆమెను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అసలు అందులో ఉంది అనుష్క శర్మేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా అనుష్క శర్మకు, విరాట్ కోహ్లికి 2017లో వివాహం అయింది. ఇటలీలోని టుస్కానీలో కొద్ది మంది స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నడుమ వారి వివాహం జరిగింది. ఇక ఈ ఏడాది ఆగస్టులో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయినట్లు ధ్రువీకరించారు. ఆ విషయాన్ని వారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లి టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు. మొదటి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 17వ తేదీన ప్రారంభం కానుంది. ఆ టెస్టు అనంతరం కోహ్లి పెటర్నిటీ లీవ్ కింద ఇండియాకు రానున్నాడు. అనుష్క శర్మ జనవరిలో బిడ్డను ప్రసవించనుందని కోహ్లి తెలిపాడు.
Watch Video:
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020
Advertisements