మాధవి లత అనగానే తన సినిమాలకన్నా తన చుట్టూ తిరిగే వివాదాలే గుర్తొస్తాయి. ఎదో ఒక వివాదంలో ఉండే మాధవి లత తాజాగా మరో సంచలన కామెంట్స్ చేసి ట్రోల్స్ ఎదురుకుంటుంది.
ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో నిఖిల్ లాక్ డౌన్ ఉన్నప్పటికీ ముందస్తు పర్మిషన్ తీసుకోని పెళ్లి చేసుకున్నారు. మాస్కులు, కొంతమంది ఆహ్వనితుల మధ్య పెళ్లి జరిగింది. ఇప్పుడు ఈ వీటిని టార్గెట్ గా మాధవి లత పోస్ట్ పెట్టింది. వీరి పేర్లు ప్రస్తావించకపోయినా తన పోస్ట్ చదవితే ఎవరికైనా అర్థం అవుతుంది అవి ఎవరిని ఉద్దేశించి పెట్టినవో.
అస్సలు ఆగట్లేదా జనాలకు… ఆ మాస్కులు వేసుకొని పెళ్లి ఎందుకు… మళ్లీ ముహుర్తాలు రావా… ఇది పోతే శ్రావణం అది పోతే మాఘం లేకపోతే ఇంకో సంవత్సరం. పిల్ల దొరకదా… పిల్లోడు మారిపోతాడా… అలా మారిపోయేటోనికి బంధాలు ఎందుకు….? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా… కొంతకాలం ఆగలేని సంసారాలు చేస్తారా అంటూ ఓ రేంజ్ లో క్లాస్ పీకింది. ఇక చివర్లో నా పోస్ట్ నా ఇష్టం నాకు నా ఫీలింగ్స్ ను ప్రకటించే హక్కు ఉందని రాసుకొచ్చింది.
ఇప్పటికే శ్రీరెడ్డి సహా పలువరితో గొడవలు పెట్టుకుంటున్న మాధవి లత తాజా కామెంట్స్ పై గట్టిగానే ట్రోల్స్ వస్తున్నాయి.