సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్స్ వచ్చి పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ఎప్పటికీ గుర్తుండి పోతారు. అలా గుర్తుండిపోయే వారిలో దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఒకరు. అయితే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఎన్నో సినిమాలు వచ్చాయి. స్వాతిముత్యం, శుభసంకల్పం, సాగరసంగమం ఇలా ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
అయితే ముఖ్యంగా స్వాతిముత్యం సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో కమల్ హాసన్ అమాయకుడిగా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జనరేషన్ వారు ఈ సినిమాని చూడకపోయినా ఈ సినిమాలోని ఓ పాటను చూసే ఉంటారు. ఈ పాట ఒక్కటి చాలు కమల్ హాసన్ ఏ స్థాయిలో ఈ సినిమాలో నటించాడు అర్థం చేసుకోవడానికి.
ALSO READ : కేజిఎఫ్ లో జూనియర్ రాఖీ భాయ్ ఎవరో తెలుసా ?
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు చాలా మంది నటీనటులు నటించారు. వారందరూ కూడా అద్భుతంగా చేశారు. అయితే ఈ సినిమాలో సుబ్బులు అనే పాత్రలో నటించింది నటి దీప. దీప 7 ఏళ్ళ వయసున్నప్పుడు ఒక మలయాళ సినిమాతో బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాలలో నటించింది. 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది దీప.
ALSO READ : బ్రహ్మానందం సినిమాలలో కనిపించకపోవటానికి కారణం ఇదేనా ?
అయితే ఆ తర్వాత పంతులమ్మ, రంగూన్ రౌడీ, ఆత్మబలం, లేడీస్ టైలర్, స్వాతిముత్యం, రాము ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక 1990లో వచ్చిన కలియుగ విశ్వామిత్ర సినిమా లో దీప ఆఖరి సారిగా నటించారు. 1982లో ఎర్నాకులం లోని సెయింట్ అల్బెర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ రెజోయ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నిర్మల్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొడుకుకి కూడా పెళ్లి అయింది.
అప్పుడు ఎన్నో సినిమాలలో నటించి తన అందంతో ఆకట్టుకున్న దీప ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆమెను చూసిన వారు ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే.