కరోనా మహమ్మారి జూలు విదుల్చుతుంది. రోజు రోజుకు ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరోవైపు సినీ ఇండస్ట్రీని సైతం వదలట్లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు ఈ మహమ్మారి బారిన పడగా…బాలీవుడ్ లో కూడా కొంత మంది సినీ స్టార్స్ కు కరోనా సోకింది. ఇటీవల అమితాబ్ సహా కుటుంబానికి కరోనా సోకగా అందరూ ఇప్పుడు రికవరీ అయ్యారు.
అయితే తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. హీరోయిన్ దిశా పటాని తండ్రి జగదీష్ పటానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ పవర్ డిపార్ట్మెంట్ లో ఎస్ పి గా ఉన్న ఈయన ఓ కేసు విషయమై లక్నో నుండి బెరేలి వెళ్లారట.ఆ సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రికి కరోనా పాజిటివ్ రావడంతో దిశా పటాని సహా ఆయన కుటుంబ సభ్యులు అందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంకాతెలుగులో దిశా వరుణ్ తేజ్ లోఫర్ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు.