చిత్ర పరిశ్రమపై హీరోయిన్స్ అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. కాగా తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోలు వయస్సుకు తగ్గ పాత్ర లో నటిస్తే బాగుంటుందన్నారు దియా. 50 ఏళ్లు పైబడిన హీరో సరసన 19 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్ నటించడం దురదృష్టకరమన్నారు. ఇది పురుషాధిక్య ఇండస్ట్రీ..అదే మహిళల విషయంలో ఇలా ఉండదన్నారు.
వయసుపైబడిన నటీమణుల కోసం ఎవరు కథలు రాయడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దియా చేసిన వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలపగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్లి పోవడం వల్లే సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్ తో సినిమాలు చేయాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.