
కరోనా కారణంగా సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోయాయి. దీనితో సినీ ప్రేక్షకులకు వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ కూడా పెరిగింది. టాప్ హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ లో నటించేస్తున్నారు.
ఇక పోతే తెలుగులో వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. ఇందులో ఈషా రెబ్బ నటిస్తుంది. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించింది కియారా. అయితే ఈషా రెబ్బా ఇప్పుడు మరో బోల్డ్ పాత్రలో నటించబోతుందని సమాచారం. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్ కు గాను ఈషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గతంలో వచ్చిన లస్ట్ స్టోరీ లానే ఈ వెబ్ సిరీస్ కూడా బోల్డ్ గా ఉండనుందని సమాచారం.