తెలుగు యంగ్ హీరోలందరితోనూ సినిమాలు చేసి, నెం.1 హీరోయిన్ గా అప్పట్లో వెలుగు వెలిగిన హీరోయిన్ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ న్యాచురల్ బ్యూటీ… ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకోబోతుంది.
ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీగా ఉన్న చిరంజీవి… ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ చేయబోతున్నారు. ఆ సినిమాలో ఓ కీలకమైన రోల్ లో జెనీలియా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్న డైరెక్టర్ సుజిత్… జెనీలియా పేరు సూచించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ పూర్తయ్యాక కథ వినిపించి, ఓకే చేయనున్నారు.
ఎన్వీ ప్రసాద్, రాంచరణ్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.