నటి హరితేజ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్, బుల్లితెరపై షోలు, యాంకరింగ్ ఇలా ఎన్నో రకాలుగా అభిమానులను అలరిస్తోంది హరితేజ. మరోవైపు వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ సంపాదించుకుంది.
అయితే తాజాగా తాను గర్భవతిని అయ్యానని హరితేజ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ముద్దుపెట్టుకుంటూ డ్యాన్స్ చేశారు. నాలుగేళ్ల క్రితం దీపక్ రావు అనే వ్యక్తిని హరితేజ వివాహం చేసుకున్నారు.