జీవితంలో తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి ఎప్పటికి ఓ మధురమైన జ్ఞాపకంగానే ఉంటాయి. జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను కాలక్రమంలో మర్చిపోయిన తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటి విషయాలను మాత్రం అస్సలు మరవలేరు. ఆ తరహా జ్ఞాపకాలు నా జీవితంలో కూడా ఉన్నాయంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా.
ఇలాంటి విషయాల్లో సినీ తరాల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. వారి పర్సనల్ లైఫ్ గురుంచి ఫస్ట్ కిస్, ఫస్ట్ లవ్ గురుంచి తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ సినీ తారలు గోప్యత పాటిస్తుంటారు. ఇలాంటి విషయాలను ఎన్నిసార్లు అడిగిన పెద్దగా ఓపెన్ అప్ అవ్వరు. నవ్వుతూ సమాధానమిస్తూ ప్రశ్నను దాటేస్తుంటారు. కానీ ఎప్పుడో ఒక సమయంలో ఓపెన్ అవుతారు.
తాజాగా గోవా బ్యూటీ ఇలియానా తన జీవితంలో తొలి అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన మొదటి ముద్దు గురుంచి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. నా ఫస్ట్ కిస్ ఓ హీరోతో అని చెప్పింది. ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్. వీరిద్దరు కలిసి నటించిన దేవదాస్ లో ఓ లిప్ కిస్ సీన్ ఉంది. అదే తన తొలి ముద్దు అని స్పష్టం చేసింది. ఇద్దరికీ ఇది తొలిసినిమానే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.