సీనియర్ నటి జమున అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను అనుసరించి
ఆమె తల్లి చితికి నిప్పు అంటించారు.
జమునకు కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఆయన విదేశాల్లో ఉండటంతో రావాడానికి ఆలస్యం అవుతుందని తెలియడంతో కుమార్తె స్రవంతి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు జమున భౌతికకాయాన్ని ఆమె నివాసం నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు.
జమునకు తుది వీడ్కోలు పలికేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మహాప్రస్థానానికి తరలివచ్చారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున శుక్రవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచా
రు.
1936లో జన్మించిన జమున అంచలంచెలుగా ఎదిగి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 198 సినిమాల్లో నటించారు. తెలుగింటి సత్యభామగా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు జమున.