భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమతో అప్పటి వరకు నవ్వుతూ తిరిగిన ముగ్గురిని కోల్పోవటం జీర్ణించుకోలేకపోతున్నామని యూనిట్ సభ్యులన్నారు. తను ముగ్గురి స్నేహితులను కోల్పోయానని హీరో కమల్ హసన్ ట్వీట్ చేయగా, సడన్ గా జరిగిన క్రేన్ యాక్సిడెంట్‌పై కాజల్ కూడా స్పందించింది.
ప్రమాద సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని… కొన్ని సెకన్ల వ్యవధిలో తాను తప్పించుకొని ఇలా ట్వీట్ చేయగలుగుతున్నాని ప్రకటించారు. సమయం, జీవితం గురించి పెద్ద పాఠాలే నేర్చుకున్నానంటూ కాజల్ ట్వీట్ చేసింది. తన కొలిగ్స్ ముగ్గురి ఆత్మకు శాంతి కలగాలని ఆమె ప్రార్థించింది. ఈ ప్రమాద సమయంలో డైరెక్టర్ శంకర్ కూడా అక్కడే ఉన్నారు.ఆయన కూడా తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకోగలిగారు.