కంగనా రనౌత్ . డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్ కమ్ డైరెక్టర్. కాంపెటీటివ్ సినీ వరల్డ్ లో హీరోయిన్ గా నెగ్గుకు రావడమే ఓ ఎత్తైతే, సినిమాని డైరెక్ట్ చేయడం ఇంకెత పెద్ద రిస్కో ఊహించిండండి. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలతో, నడవడితో సాగిపోతుంది.తన రాతలతో,వాతలతో రూలింగ్ పార్టీపై సైతం నిర్భయంగా ట్వీట్స్ చేస్తూ ఆ మధ్య వార్తల్లోకెక్కి.తన ట్విటర్ ఖాతా కోల్పోయింది కంగన. ట్విటర్ యాజమాన్యం మారడంతో ట్విటర్ ఖాతా మళ్ళీ తెరుచుకోవడంతో కమ్ బ్యాక్ ట్వీట్ చేసి ప్రేక్షకులకు తీపికబురు చెప్పింది.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ‘హలో ఎవ్రీవన్, ఇట్స్ నైస్ టు బి బ్యాక్ హియర్’ అంటూ పలుకరించింది. అంతేగాక రాబోయే సినిమా ‘ఎమర్జెన్సీ’కి సంబంధించిన బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియో ఇమేజ్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది.
దానికి ‘ఎమర్జెన్సీ సినిమా నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 20న సినిమా హాల్స్ లో కలుద్దాం (అండ్ ఇట్స్ ఎ వ్రాప్ !!! ఎమర్జెన్సీ ఫిల్మింగ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ.. సీ యు ఇన్ సినిమాస్ ఆన్ 20@ అక్టోబర్ 2023)’ అని క్యాప్షన్ ఇచ్చింది. అందాల నటి మళ్లీ ట్విటర్‌లోకి వచ్చినట్లు ట్వీట్ చేయడంతో ఆమెకు వెల్‌కమ్ బ్యాక్ అంటూ రిప్లై ఇవ్వడానికి అభిమానులు పోటీపడుతున్నారు.
కాగా, గత ఏడాది మే నెలలో ‘ట్విటర్’ కంగనా రనౌత్ ఖాతాను సస్పెండ్ చేసింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జి విజయం సాధించిన సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా కంగనా ట్వీట్ల వర్షం కురిపించింది.
ఒక దశలో మమత బెనర్జి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. ఆమె ట్వీట్‌లు వివాదాస్పదం కావడంతో ట్విటర్ ఆమె ఖాతాను నిలిపేసింది. ఇప్పుడు యాజమాన్యం మారడంతో ఎలాన్ మస్క్ కంగనాపై సస్పెన్షన్‌ను ఎత్తేశారు.