ఎప్పుడు స్టైలిష్ గా గ్లామర్ గా కనిపించే కీర్తి సురేష్ కు మహానటి సినిమాకు గాను జాతీయ స్థాయి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కీర్తి సురేష్ కొన్ని విషయాలను మీడియా తో పంచుకుంది. మొదట మహానటి కథ విన్నప్పుడు నేను చేయలేనని చెప్పాను. కానీ మా మామయ్య గోవింద్ నన్ను ఒప్పించారు. మా మామయ్య వల్లే నేను ఈ సినిమా చేశాను.
మరోవైపు దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా మిమ్మల్ని తప్ప నేను ఎవరిని ఉహించుకోలేకపోతున్నానంటూ అన్నారని తెలిపింది. ఎట్టకేలకు సినిమాకు ఒప్పుకున్నానని, ఇప్పుడు ఈ అవార్డు రావటానికి కారణం అయిన నాగ్ అశ్విన్ కు, మామయ్య గోవింద్ కు ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపింది.