తెలుగునాటి మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది కీర్తి సురేశ్. అద్భుత నటనతో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఇక నటన పరంగా టాలీవుడ్ లో కీర్తి చేస్తున్న సినిమాలన్నీ బోనస్సేనని చెప్పాలి.
నిజానికి జరుగుతున్నది కూడా అదే.! మహానటి మూవీతర్వాత పెద్దగా హిట్స్ లేకపోయినా మహానటి క్రెడిబిలిటీ ఆమెని ముందుకు నడిపిస్తోంది. ఓ క్లాసీ హీరోయిన్ గా టాలీవుడ్లో ఆమె పేరు నిలిచిపోయింది.
ప్రస్తుతం కీర్తి సురేశ్ దసరా సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది. అభిమానులు సైతం కీర్తి సురేశ్ దసరాతో నేషనల్ అవార్డ్ కొట్టేస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
దసరా సినిమా ప్రమోషన్స్ కోసం కీర్తి సురేశ్ మునుపెన్నడూ లేని విధంగా అందాలను ప్రదర్శించేస్తోంది. సోషల్మీడియా హాట్హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.
వామ్మో కీర్తి..! నువ్వేనా అంటూ కామెంట్లు పెడతున్నారు. అయితే ఇటీవలే కీర్తి సురేశ్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందని వార్తలు వచ్చాయి. సినిమాలకు గుడ్బై కూడా చెప్పనుందని కూడా కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటిని కీర్తి కొట్టిపారేసింది.