బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా సుశాంత్ ఎందుకు ఎలా మృతి చెందాడన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో సుశాంత్ సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఈడీ ఎదుట హాజరైంది. ఈ నేపథ్యంలో నటి కృతి సనన్ సోషల్ మీడియాలో ఓ గూడార్థమున్న పోస్ట్ పెట్టింది.
మబ్బులు కమ్ముకున్నాయి. పొగ మంచు కప్పి ఉంది. స్పష్టంగా ఏదీ కనిపించట్లేదు. కానీ నిజం సూర్యుడు లాంటిది. అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది. కాబట్టి అనుమానాలు వద్దు. సహనంతో వేచి చూడండి. కాసేపు గాలి వీచొచ్చు.. వర్షాలు పడొచ్చు. కానీ మిత్రమా గుర్తుపెట్టుకో..! కొన్ని సార్లు సూర్యుడు ప్రకాశించడం కోసం ఉరుములు దారి ఇస్తాయని పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.