హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన క్రిష్ సీక్వెల్స్ ఎంతటి విజయాన్ని సాధించాయో కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే క్రిష్ 4 కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, దీనికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.హృతిక్ గ్రహాంతర ఫ్రెండ్ జాదూ ఈ మూవీలో మరోసారి కనిపించనున్నాడట. అయితే తాజాగా క్రిష్ 4 లో నక్షత్ర మండలాల్లోకి ప్రయాణించే థీమ్ చూపించనున్నారట. మరోవైపు ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ లో హీరోయినుగా ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్ జోనస్ తో కలిసి అమెరికాలోనే సెటిల్ అయింది. ఇక హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్ సరసన కృతి సనన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం అవుతోంది.