ప్రియమైన ఫాలోవర్స్ నా ఫేస్ బుక్ లో నా పై వస్తున్న నెగిటివిటి తో పూర్తిగా విసుగు చెందాను. దాదాపు 90 శాతం మంది నాపై నెగిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ సమాజానికి ప్లాస్టిక్ నవ్వులే కావాలి. నేను అలా ఉండలేను. ఈ రోజు నుంచి నా ఫేస్ బుక్ ని నేను హ్యాండిల్ చేయడం లేదు. ఇకపైన నా టీం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే ఇంట్రాక్ట్ అవుతాను నన్ను అభిమానించే వారి ప్రేమకు సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. ఇకపై ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో అందుబాటులో ఉంటా… ఈ మాటలు అన్నది ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ బీజేపీ యువ నేత మాధవి లత.
అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంతో మాధవి లత వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు 5.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న తన ఫేస్ బుక్ ఖాతా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.