హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలని ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టింది మమతా మోహన్ దాస్ . హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్లో మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది.. క్యాన్సర్ మహమ్మారి తనను ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు మరింత ఇబ్బందులకు గురిచేసింది. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత పూర్తి ఆరోగ్యంతో బయటపడింది మమతా మోహన్ దాస్.
ఆరోగ్యం పూర్తిగా కోలుకొని ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న తరుణంలో మరో అరుదైన వ్యాధి బారిన పడింది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు.. మానసిక ధైర్యంతో సమస్యలకు ఎదురు నిలిచి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు మమత మోహన్ దాస్ .. గతంలో రెండు సార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచిన ఈమె తాజాగా ఆరోగ్య సంరక్షణ, వ్యాయామం.. జీవితాన్ని ఎలా మెరుగుపరిచాయని చెప్పుకొచ్చింది. తన జీవితంలో ప్రయోగాలు ఇంకా ముగియడం లేదు.. మరో కొత్త సమస్యతో పోరాడుతున్నాను.. ప్రస్తుతం ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చిందని బొల్లి అనే చర్మ సమస్య ఉందని చెప్పుకొచ్చింది మమతా మోహన్ దాస్.
ఆమె మాట్లాడుతూ.. మహేష్ మారుతియుమ్ సినిమా షూటింగ్ సమయంలోనే నా శరీరంపై తెల్లటి మచ్చలను నేను గమనించాను.. ఆ తర్వాత మెడ, ముఖం, అరచేతులకు కూడా వ్యాధి వ్యాపించింది.. టాబ్లెట్లు వేసుకున్నా ఊపిరితిత్తుల సమస్యలు రావడంతో టాబ్లెట్లు తగ్గించాను. దీంతో శరీరంపై మచ్చలు బాగా పెరిగిపోయాయి.. క్యాన్సర్ వచ్చినప్పుడు నా ధైర్యాన్ని నమ్ముకున్నాను నువ్వు స్ట్రాంగ్ అని చాలామంది చెప్పేవారు కానీ ఈసారి అలా జరగలేదు. ఒంటరిగా ఉండిపోయాను స్నేహితులను పిలవలేదు. రోజుల తరబడి ఒంటరిగా కూర్చొని ఏడ్చేసాను. గదిలో చాలా రోజులు నన్ను నేను నిర్బంధించుకున్నాను.
నెలల పాటు చీకట్లో ఉండి పోయాను.. కానీ అలా ఉండిపోవడం నన్ను చంపేస్తుందని తెలుసుకున్నాను.. అందుకే నా సమస్యను బయటపెట్టాను.. అప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది.. నాకేమైందని ఎవరైనా అడిగితే ఇన్స్టా చూడమని చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు మమత.