సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.చెన్నైలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. తన భర్త అంతిమ సంస్కారాలను స్వయంగా మీనాయే నిర్వహించడం పలువురిని కంటతడి పెట్టించింది.
తెలుగు సహా దక్షిణాదిలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది. వీరి వివాహం తర్వాత ఆయన పలు వ్యాపారాలు చేస్తున్నారు. కొద్దికాలం క్రితం కరోనా బారిన పడిన విద్యాసాగర్ పావురాల వ్యర్ధాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలి అనుకుంటూ ఉండగానే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.
అయితే సాధారణంగా అంత్యక్రియల విషయంలో మగవాళ్లే ఆ బాధ్యతలు చూస్తూ ఉంటారు కానీ మీనా అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించడం అక్కడికి వచ్చిన వారందరికీ కంటతడి పెట్టించింది. చిన్నారి నైనిక కూడా తన తండ్రిని కోల్పోవడంతో చాలా దుఃఖం వదనంతో కనిపించింది. మీనాకు ఒక కుమార్తె ఉండడంతో కొడుకు ఎవరూ లేకపోవడంతో మీనా స్వయంగా తన భర్త అంత్యక్రియలు ఏర్పాట్లు చేసుకున్నారు.
మీనా కుటుంబాన్ని తమిళ సినీ పరిశ్రమ నుంచి అనేకమంది సినీ ప్రముఖులు పరామర్శించారు. రజనీకాంత్, శరత్ కుమార్ వంటి వారు మీనా కుటుంబాన్ని ఓదార్చారు. మీనా ఇంటి దగ్గర నెలకొన్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి.