గడ్డలకొండ గణేష్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ మృణాళిని రవి. తమిళనాడు కు చెందిన ఈ బామ డబ్ స్మాష్ లతో సెలబ్రిటీ అయ్యింది. ఆ పాపులారిటీ తోనే వరుణ్ తేజ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గడ్డలకొండ గణేష్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను మన్ననలు పొందింది. అథర్వ మురళి సరసన నటించిన మృణాళిని తన అందంతో అభినయంతో విమర్శకులను సైతం మెప్పించింది. ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.