ఇండియన్ ఫిల్మ్ ఇండిస్ట్రీలో రైజింగ్ స్టార్‌గా దూసుకెళ్తోంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ గతేడాది సీతారామం చిత్రంతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. సీత, ప్రిన్సెస్ నూర్జాహాన్ రెండు విభిన్న పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగువారికి బాగా దగ్గరైంది. మొదటి చిత్రంతోనే తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం నాని చిత్రం కోసం మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందట. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా కోసం ఏకంగా రూ.3 కోట్ల వరకు పారితోషికాన్ని అడిగిందని టాక్ నడుస్తోంది. సీతారామం సినిమాతో తనకు వచ్చిన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ ముద్దుగుమ్మ భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్.. కేవలం ఒక్క హిట్‌కే పారితోషికం భారీగా పెంచేసరికి టాలీవుడ్ మేకర్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే అందంతో పాటు అభినయం కూడా కలగలపుగా ఉన్న ఈ బ్యూటీని మాత్రం పక్కకు పెట్టాలని కూడా వారు అనుకోవడం లేదట. దీంతో టాలీవుడ్లో ఆమె తన స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు మృణాల్ ప్రయత్నిస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్లో పనిచేసేందుకు ఆమె ఎంతో నిబద్ధతతో ఉందో తెలుస్తుంది. హైదరాబాద్‌లో ఇల్లును కొనుగోలు చేయాలనే నిర్ణయం.. టాలీవుడ్లో సుస్థిర స్థానం సంపాదించాలనే ఆమె కోరిక తెలుస్తోంది. మృణాల్ నిర్ణయంతో ఇప్పటికే అగ్రతారలుగా కొనసాగుతున్న హీరోయిన్లకు సవాలుగా మారింది.
నాని నటిస్తున్న 30వ చిత్రంలో మృణాల్ హీరోయిన్గా చేస్తుంది. ఈ సినిమాకు నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ సినిమా హృదయం లాంటి సూపర్ హిట్‌కు సంగీతాన్ని సమకూర్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ఐఎస్సీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.