నిర్మలమ్మ” తెలుగు సినిమా గర్వించ దగిన నటుల్లో ముందు వరుసలో ఉంటారు. ఏ పాత్రలో అయినా సరే జీవించడం ఆమె సొంతం. ఇప్పటి హీరోలకు అంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణకు ఆమె అమ్మగా అమ్మమ్మగా నటించారు. ఆమె పాత్ర ఏదైనా సరే దానికి న్యాయం చేస్తారనే చెప్పాలి. ఇక మయూరి సీతారామరాజు వంటి సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు.
Also Read:అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు.. ఈ దేవతలు
చినరాయుడు సినిమాలో పళ్ళు బయట పెట్టి నవ్వుతుంటే ఫిదా అయిపోయారు. ఇక ఆమెకు అలనాటి హీరోలకు మధ్య మంచి అనుబంధం ఉండేది. అప్పటి హీరోలు ఆమెను నిర్మలమ్మ అని ఆప్యాయంగా పిలిచే వారు. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ మేనేజర్ అయిన జీవీ కృష్ణా రావు ఆమెను చూసి ప్రేమలో పడగా ఆ తర్వాత నిర్మలమ్మ ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడటం తో పెళ్లి అయిపోయింది.
పెళ్లి సంబంధం మాట్లాడే టైం లో నిర్మలమ్మ పెళ్లి తర్వాత కూడా నటిస్తాను అని చెప్పడం, కృష్ణారావు అందుకు ఒకే అనడంతో పెళ్లి అయిపోయింది. అయితే నిర్మలమ్మకు, కృష్ణ రావు దంపతులకు మాత్రం పిల్లలు లేరు. దీనితో మానసిక ఒత్తిడికి గురైన ఆమె సినిమాలకు కొన్నాళ్ళు దూరంగా ఉంది. ఆ సమయంలో కృష్ణా రావు ఆదాయం బాగా పడిపోవడంతో మళ్ళీ ఆమె సినిమాల్లోకి వచ్చారు.
1961 లో కృష్ణ ప్రేమ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఇక ఆలోచించే అవసరం రాలేదు. సీతారామ రాజు సినిమాలో విలనిజం కూడా పండించారు. తన నట వారసుడిగా… మనవడు విజయ్ ను ఆమె సినిమాల్లోకి పంపారు. పిల్లలు లేకపోవడంతో ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని పెళ్లి చేసింది. ఆ తర్వాత విజయ్ అనే అబ్బాయి పుట్టడం ఆ తర్వాత పడమట సంధ్యారాగం వంటి సినిమాల్లో అతను నటించడం జరిగాయి. ఆయన ఎక్కువగా అమెరికాలోనే ఉండే వారు. ఆయనకు శోభా అనే అమ్మాయితో వివాహం జరిగింది. మనవడి పెళ్లి చూడాలని కలలు కన్నా సరే సాధ్యం కాలేదు.