అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నిత్యామీనన్. ఆ మూవీ హిట్ కావడంతో వరుస అఫర్లు వచ్చాయి. కానీ.. పద్దతి గల సబ్జెక్ట్స్ కే ఓకే చెప్తూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిచుకుంది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోని సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం నిత్య వయసు 34 ఏళ్లు. ఎట్టకేలకు పెళ్లిపై మనసు పారేసుకుందని వార్తలు వస్తున్నాయి. మలయాళీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో నిత్య పెళ్లి జరగనుందని సమాచారం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీళ్లిద్దరూ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
తమ ప్రేమను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు ఇటీవల ఇరు కుటుంబసభ్యులకు పెళ్లి విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. పెద్దలు అంగీకరించడంతో త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
8 సంవత్సరాల వయసులోనే ద మంకీ హు న్యూ టూమచ్ అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటన మొదలుపెట్టింది నిత్య. 17 ఏళ్ల వయసులో ఓ కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది. ఎక్కువగా మలయాళీ సినిమాలే చేసింది.