జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ నివేదా థామస్. ఆ తరువాత వచ్చిన నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరు సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంది. ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న వి చిత్రంలో నటిస్తోంది.
త్వరలోనే ఓటీటీ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తనకిప్పుడే పెళ్లిపై అంత ఆసక్తి లేదంటోంది. ప్రస్తుతం పెళ్లి ఆలోచన తన మైండ్ లో లేదని, కొన్ని స్క్రిప్ట్ లు రాసే పనిలో ఉన్నానంటోంది. అయితే ఫస్ట్ మంచి సినిమా డైరెక్ట్ చేయాలనేదే తన కోరిక అంటూ చెప్పుకొస్తుంది.