తన ఎక్స్‌పోజింగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన అమ్మడు పాయల్ రాజపుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో హీరో కార్తికేయ సరసన RX100 సినిమాలో నటించిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటనలో అందాలు ఆరబోయటంలో విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య హీరోలుగా వచ్చిన వెంకీ మామ సినిమాలో వెంకీ సరసన నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ రావటంతో పాయల్ తెగ ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. పొట్టి పొట్టి గౌన్ లు వేసుకుని అందాలను ఆరబోస్తుంది. పాయల్ ప్రస్తుతం మాస్ మాహారాజ్ రవితేజ నటిస్తున్న డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది.