అంబరీష్ కు సుమలతాంజలి - actress politician sumalatha pays tributes to veteran actor ambarish- Tolivelugu

అంబరీష్ కు సుమలతాంజలి

ప్రేమకు మరణం లేదు. ప్రియుడు తనువు చాలించినా ప్రేమ అంతరించిపోదు. ఇది కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ , సౌత్ హీరోయిన్ సుమలత అమరప్రేమ. గత ఏడాది నవంబర్ 24న అంబరీష్ అనంతలోకాలకు వెళ్ళిపోయినా ఎంతో ప్రేమించిన సతీమణి సుమలత తమ ప్రేమ బంధాన్ని మదిలోనే శాశ్వతం చేసుకున్నారు. ఇద్దరి దాంపత్యానికి తీపి గుర్తుగా కుమారుడు తోడున్నా  భర్త అంబరీష్ మధుర జ్ఞాపకాలు ఇంకా మననం చేసుకుంటున్నారు.

actress politician sumalatha pays tributes to veteran actor ambarish, అంబరీష్ కు సుమలతాంజలి

ఒక వైపు భర్త అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ వారసురాలిగా ఎంపీగా ఎన్నికయిన సుమలత అంబరీష్ కు ఇష్టమైన అంశాలను ఆయన చిత్రపటానికి నైవేద్యంగా పెడుతున్నారు. భర్తే దైవంగా భావించి అపూర్వ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అంబరీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయనకు ఇష్టమైన పదార్ధాలన్నీ బ్లాక్ లేబుల్ విస్కీ, సోడా సహా ముందుంచి పక్కనే నిలిచి ఉన్న ఫోటో మీడియాలో వైరల్ అయింది. భర్త మనసు అర్ధంచేసుకున్న ప్రియమైన ఇల్లాలి శ్రద్ధాంజలి ఇది.

Share on facebook
Share on twitter
Share on whatsapp