ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస అవకాశాలు కొట్టేసిన సుందరి పూజ హెగ్డే. దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత, మహర్షి, గడ్డలకొండ గణేష్ సినిమా విజయాలతో మంచి జోష్ మీద ఉంది పూజ. బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావటంతో అటువైపు కూడా అడుగులేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫొటోలతో యువతకి మతులుపోగొట్టే ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. పొట్టి పొట్టి డ్రెస్ లతో పూజ పెట్టిన ఫోటో లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.