టాలీవుడ్ నటి పూజిత విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ గణేష్ సినిమాలో తాను నటించానని కాని ఎడిటింగ్ లో కనిపించకుండా పోయానని చెప్పుకొచ్చారు. అలాగే కన్నడ మూవీ లో కూడా ఛాన్స్ కూడా వచ్చి పోయిందని తెలిపారు.
ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని విషయాలు నచ్చకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారానని చెప్పుకొచ్చారు. అలాగే చేయాలనే తపన ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా రాణించొచ్చు అని అన్నారు. సంకల్పం ఉన్నప్పుడు కచ్చితంగా అవకాశాలు వస్తాయని తెలిపారు. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు… ఆఫర్ల కోసం అడగటం లో తప్పేం లేదని చెప్పుకొచ్చారు.
ALSO READ : చిన్న వయసులో చనిపోయిన 10 మంది హీరో,హీరోయిన్స్ … కారణాలు!!
అలాగే రాజేంద్రప్రసాద్ ఒక అని మంచి ఆర్టిస్ట్ అని ప్రశంసించారు. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలని… నేర్చుకోవచ్చని కూడా తెలిపారు. అయితే రాజేంద్రప్రసాద్ కు చాలా కోపం అని ఆ కోపం వల్ల దగ్గరకు వెళ్లలేమని తెలిపారు. అప్పట్లో ఎంత బిజీగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే స్థాయిలో బిజీగా ఉన్నారని అన్నారు.
ALSO READ : తొలి మూడు సినిమాలు హిట్ అవ్వగానే ఉదయ్ కిరణ్ ని ఎవరు భయపెట్టారు ? అప్పుడు ఉదయ్ కిరణ్ ఎలా చేసాడంటే?
ఓ సారి నా మీద కోపంతో అరిచారు కాబట్టే ఆయనకు కోపం అని చెప్పానని అన్నారు. సీన్ లో భాగంగా రాజేంద్రప్రసాద్ ను తోసేస్తే ఆయన కసిరారని ఆ సమయంలో గుండె ఆగిపోయిందని పూజిత వెల్లడించారు. ఆయన తిట్టడంతో 3 టేకులు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే ఇతరులతో మాట పడటం ఇష్టం ఉండదని అనవసరంగా తనపై కామెంట్లు చేస్తే దవడ పగలగొడతా నని హెచ్చరించారు పూజిత.