ఎన్టీఆర్ పై పూనమ్ కౌర్ ట్వీట్... ఆ ట్వీట్ కి అర్ధం ఏంటి ? - Tolivelugu

ఎన్టీఆర్ పై పూనమ్ కౌర్ ట్వీట్… ఆ ట్వీట్ కి అర్ధం ఏంటి ?

పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందంటే ఏదో ఒక కాంట్రావర్షి ఉంటుంది. ఇటీవల మే 20 న పుట్టినరోజు జరుపుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పూనమ్ విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్’ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

ఇంతకు పూనమ్ ఎందుకు ఆ ట్వీట్ చేసిందనేది ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం అర్ధం కాలేదు. కొంత మంది పూనమ్ ను తిడుతుంటే మరి కొంత మంది ఆమె చేసిన ట్వీట్ ను స్వాగతిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp