ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ మరో సారి వార్తలకెక్కింది. నేను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని కలవాలనుకుంటున్నాను అంటోంది పూనమ్. అసలు విషయం ఏంటంటే నవంబర్ 12 గురు నానక్ 550 వ జయంతి సందర్బంగా కర్తాపూర్ కారిడార్ ను ఆవిష్కరించనున్నారు ప్రధాని మోడీ. ఈ కారిడర్ పాకిస్థాన్ లోని గురుద్వార్ దర్బార్ సాహిబ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వార్ కు ఇండియాకు ఆనుకొని ఉంటుంది.
అయితే ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరవుతున్నారు. ఈ వేడుకలో పాల్గొనాలని నాకు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారని పూనమ్ చెప్పుకుంటున్నారు. అధికారులు అవకాశం ఇస్తే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని కలవాలని ఉందన్నారు. 1947లో విభజన అనంతరం దర్బార్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన మొదటి భారతదేశ సిక్కు మహిళను నేనేనంటూ చెప్తున్నారు పూనమ్.