షామ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా నటించింది…కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. లాస్ట్ ఇయర్ జూన్ లో దుబాయ్‌కి చెందిన బిజినెస్ మేన్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఫామిలీ మెంబర్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
తాను గర్భం దాల్చినట్టు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి పూర్ణ చెప్పింది. ఇప్పుడు పూర్ణ ఇంట్లో సీమంతం వేడుకలు ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోస్ ని పూర్ణ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వేడుకకి ఆమె బంధువులందరూ హాజరైనట్లు తెలుస్తోంది.
పూర్ణ ‘శ్రీమహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ లో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమటపాకాయ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మలయాళ భామ పూర్ణ. సీమటపాకాయ్ సినిమాతో వచ్చిన క్రేజ్ తో అవును, అవును 2, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాల్లో నటించింది.
అలానే రాజుగారి గది, శ్రీమంతుడు, సిల్లీ ఫెలోస్, అదిగో, సువర్ణ సుందరి, పవర్ ప్లే, తీస్ మార్ ఖాన్, అఖండ, దృశ్యం 2 లాంటి మూవీస్ లోనూ ప్రత్యేక పాత్రలో నటించి.. అందర్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’లో కీలక పాత్ర పోషించింది. మరోవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ జడ్జిగా సందడి చేసింది.