పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బ్యాక్ డోర్. ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో యంగ్ హీరో తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర పతాక సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. పూర్ణ ఎంత మంచి పెర్ఫార్మర్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తనకు చాలా మంచి పేరు వస్తుంది.
బ్యాక్ డోర్ వల్ల ఇంటిలోకి ఎంట్రీ అవ్వటం వల్ల ఎదురయ్యే కొన్ని విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని దర్శకుడు బాలాజీ చెప్పుకొచ్చారు. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.