హీరో తల్లిగా, హీరోయిన్ తల్లిగా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది నటి ప్రగతి. అయితే సినిమాలలో ఎంతో సాంప్రదాయంగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ గా కనిపిస్తుంది. అయితే ఈమెను చూసిన నెటిజన్లు సినిమాలలో కనిపించే ప్రగతినా ఈమె అంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు.
కాగా తాజాగా మరోసారి ప్రగతి హాట్ లుక్ లో కనిపించి నెట్టింట్లో రచ్చ చేసింది. ఇటీవల ఆమె తన పదహారేళ్ళ కూతురు పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇచ్చింది. ఆమెకు కూతురు ఉన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే బర్త్ డే సందర్భంగా తనకూతురు తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. చిన్న వయసులోనే హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలు చేయడం వల్ల ఇంత పెద్ద కూతురు ఉందని ఎవరు అనుకోలేదు. ఇక ఆ సమయంలో కూతురు తో దిగిన ఓ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.