అలా చేసినందుకు పరిహారం చెల్లించాల్సిందే : ప్రియమణి

అందాల నటి ప్రియమణి చాలాకాలం తర్వాత వార్తల్లోకి వచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (” మా ” ) కు ఆమె ఓ ఫిర్యాదు సమర్పించింది. ” అంగుళిక ” చిత్ర దర్శకనిర్మాతలు తమ సినిమా పబ్లిసిటీ కోసం తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్నారని ఈ అమ్మడు ఆరోపించింది. నిజానికి ఈ మూవీ షూటింగ్ అయిదేళ్ళ క్రితం ప్రారంభమై ఇటీవలే ముగిసింది.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించేందుకు తను మొదట సంతకం చేశానని, అయితే కొన్ని కారణాలవల్ల ఆ తర్వాథ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని పేర్కొంది. ఈ సినిమా మేకర్స్ మరో హీరోయిన్ తో చిత్రం పూర్తి చేశారు. కానీ టీజర్లో నా ఫోటోలను వాడుకున్నారు అని ప్రియమణి తెలిపింది. ఇది సరికాదని, వారు తనకు నష్ట పరిహారం చెల్లించాలని, పైగా వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించింది.