రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో మాయాజాలం ప్రదర్శిస్తూ.. తెలుగు తెరపై కుర్రకారు మతి పోగేట్టేసింది. కెరటం సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా పరిచయమైన రకుల్ ఆ తరువాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటించి మొదటి హిట్ దక్కించుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను దక్కించుకుంది రకుల్. అదే ఊపులో లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎక్కువ కాలం ఎవరిని వరిస్తోందో చెప్పడం కష్టం…అలాగే రకుల్ పరిస్థితి కుడా తారుమారైంది. ఇక, ఆమె చేసే సినిమాలు ప్లాప్ లిస్టులోకి వెళ్ళడంతో ఈ బ్యూటీకి సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక,లాభం లేదనుకొని హిందీ సినిమాలపై కాన్సంట్రేట్ చేసింది.
తెలుగులో అవకాశాలు అంతగా రాకపోవడంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది రకుల్. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్ళనే రాబట్టింది. ఇదిలా ఉండగా..తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఆమె సూపర్ చాన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. హీరో అజయ్ దేవగన్ తో నటించే చాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అజయ్ హీరోగా రూపొందే ‘థ్యాంక్ గాడ్’ చిత్రంలో ఆయనకు జోడీగా రకుల్ ను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. అసలే అవకాశాలు లేక ఇబ్బంది పడుతోన్న రకుల్ కు ఈ అవకాశం రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతుందట. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి రకుల్ కు మరిన్ని చాన్స్ లు తీసుకువస్తాయా..?లేదో చూడాలి మరి.