వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ రకుల్. నటనతో అందంతో అమాంతం క్రేజ్ పెంచుకున్న ఈ అమ్మడు వరుస సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఎప్పడూ ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టె రకుల్ కు సొంతంగా జిమ్ కూడా ఉంది. కాస్త సమయం దొరికిన జిమ్, యోగ అంటూ గడిపే రకుల్ వర్క్ అవుట్ చేస్తున్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా యోగి చేస్తూ వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను రకుల్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్, కోలీవుడ్ వైపు అడుగులేస్తోంది రకుల్.