కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రముఖులు ఈ వైరస్ బారినపడటం కలకలం రేపుతోంది. తాజాగా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లింది. తనకు కరోనా సోకిన విషయాన్ని రకుల్ ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించింది.
తాను బాగానే ఉన్నానని తెలిపిన రకుల్.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ కనిపిస్తానని వెల్లడించింది. ఇటీవల తనను కలిసిన వారంతా కచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని.. అవసరమైతే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. అభిమానులెవరూ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని సూచించింది.
😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020