సుశాంత్ సింగ్ ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. తను డ్రగ్స్ డీలర్స్ నుండి డ్రగ్స్ తీసుకుందని అధికారులు దృవీకరించారు. ప్రస్తుతం ఆమె ముంబై జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది.
ఈ కేసులో పలువురు డ్రగ్స్ డీలర్స్, రియా, ఆమె సోదరున్ని ప్రశ్నించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇందులో 25మంది బాలీవుడ్ సెలబ్రిటీలున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. దీంతో వారికి నోటీసులు ఇచ్చే ముందు ఢిల్లీలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డీజీ అధికారులతో సమావేశం అయ్యారు.
ఈ 25మందిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినపడుతుంది. రకుల్ ప్రీత్ తో పాటు సారా అలీఖాన్, సెలబ్రిటీ డిజైనర్ సిమోన్ ఖంబాటాలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సారా అలీఖాన్ తో పాటు పలువురు సుశాంత్ సింగ్ తో కలిసి తామంతా డ్రగ్స్ తీసుకున్నట్లు రియా విచారణలో ఒప్పుకుందని ప్రచారం జరుగుతుంది.