తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు సరైన హిట్ లేక పరితపిస్తున్న హీరోయిన్ రాశికన్నా. తాజాగా ఈ అమ్మడు ఖాతాలో వరుసగా రెండు హిట్ సినిమాలు పడటంతో ఈ అమ్మడు టాప్ లో నిలిచింది. ఇది వరకు తనని పట్టించుకోని దర్శకులు సైతం ఇప్పుడు ఈ అమ్మడు కోసమే చూస్తున్నారట. అంతంత మాత్రంగా కెరీర్ ను నెట్టుకొస్తున్న రాశి వెంకటేష్, నాగచైతన్య సినిమాలో విలేజ్ గర్ల్ గా నటించిన మంచి హిట్ కొట్టింది. వెంటనే గ్యాప్ కూడా తీసుకోకుండా ప్రతిరోజు పండగే సినిమాలో టిక్ టాక్ గర్ల్ గా మరోసారి తన నటనను నిరూపించుకుంది.
2020 లోనూ అదే జోరు చూపించాలని రాశికన్నా అనుకుంటుంది. ప్రస్తుతం విజయ దేవరకొండ హీరోగా వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రాశికన్నా నటిస్తుంది. ఈ సినిమా మొత్తంలో రాశికన్నా పాత్ర హైలెట్ గా నిలవనుంది సమాచారం. ఇదంతా చూస్తుంటే ఈ అమ్మడు తన కథలో మరో హిట్ వేసుకునేట్టు కనిపిస్తుంది. మరోవైపు కోలీవుడ్ ని కూడా వదలట్లేదు రాశికన్నా. ప్రస్తుతం సిద్దార్థ్ సరసన సైతాన్ కా బచ్చా అనే ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా 2020 ఆరంభంలోనే రిలీజ్ కానున్నాయి.