‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు ఆకట్టుకోకపోవడంతో రాశిఖన్నాకు ఇక సినిమా అవకాశాలు రావడం కష్టమేనని అంత అనుకున్నారు. అయినప్పటికీ వరుస సినిమా ఛాన్స్ లు రావడంతో అంత ఖంగుతిన్నారు. ఇందుకు కారణం లేకపోలేదట. ఆమె వ్యక్తిత్వమే రాశిఖన్నాకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల ఆమె చేసిన వెంకీ మామ, ప్రతి రోజు పండగే సినిమాలు హిట్ అవ్వడంతో రాశిఖన్నా తెగ సంబరపడిపోయింది. రెండు వరుస సినిమాలు హిట్ కావడంతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. వరల్డ్ ఫేమస్ లవర్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలుస్తుందని ఎన్నో అంచనాలు పెట్టుకొంది రాశిఖన్నా. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇదే విషయమై రాశిఖన్నా తన సన్నిహితుల వద్ద ఈ సినిమా నిరాశపర్చిందని చెప్పిందట. ఈ చిత్రంలో తన పాత్ర సంతృప్తిని ఇచ్చిన సినిమా డిజాస్టర్ కావడంతో ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై తన పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహిస్తానని చెప్పుకొచ్చిందట. మొత్తానికి విజయ్ దేవరకొండ సరసన నటించి రాశిఖన్నా ఓ గుణపాఠం నేర్చుకుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.