మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. జనవరి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. సుదీర్ఘ విరామం తరువాత అంటే 13 సంవత్సరాల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచుతున్నాయి. అదే విషయంపై హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ ఈ సినిమాలో ఇద్దరి స్టార్స్ తో ఒకే సారి నటించటం చాలా ఆనందంగా ఉంది. విజయశాంతి గారి లాంటి స్టార్ తో కలిసి పనిచేయటం మంచి అనుభూతి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను విజయశాంతిగారు మెప్పించారు.
మొదట ఆవిడతో షూట్ చెయ్యటానికి కొంచెం భయం వేసింది. మొదటి సారి ఆమెతో కేరళలో నటించాను. ఆమె దగ్గర నుంచి డాన్స్, నటన పై కొన్ని సలహాలు కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో విజయశాంతి గారు మహేష్ బాబు పోటాపోటీగా నటించారు. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ మొత్తం ఉందంటూ చెప్పుకొచ్చింది రష్మిక.