వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘చలో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరునీకెవ్వరు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. మరో వైపు సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో రష్మిక నటిస్తుంది.
ఎప్పుడూ బిజీ బిజీ గా గడిపే రష్మిక మందన్న కాస్త టైం దొరికిన ఫోటో షూట్ చేస్తూ హల్ చల్ చేస్తుంది. తాజా ఫొటో షూట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రష్మిక. రష్మిక అందాలను చూసి నెటిజన్లు తెగ కామెంట్స్ చేసేస్తున్నారు.