టాలీవుడ్ యంగ్ బ్యూటీ రష్మిక ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ అందుకుకోపోయినప్పటికీ.. తర్వాత చిత్రం గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అంతే ఒక్కసారిగా రష్మిక క్రేజ్ మారిపోయింది.
దీంతో తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందింది. దీంతో తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ వరుస ఆఫర్లు తలుపు తట్టాయి.
ప్రస్తుతం హిందీలో గుడ్ బై, యానిమల్, మిస్టర్ మజ్నూ… తమిళంలో వరిసు చిత్రాల్లో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న గుడ్ బై చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత… ఫ్యామిలీ విషయాలను పంచుకుంది.
తాను మొదటి సారి సినిమాల్లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు తన తల్లిదండ్రులు వద్దని చెప్పారంటూ చెప్పుకొచ్చింది. ” వాళ్లు నాకు ఎప్పటికీ తోడుగా ఉంటారు. నా నిర్ణయాలకు వారు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అలాగే వాళ్లు చెప్పే ప్రతి మాటను నేను అంగీకరిస్తాను. నేను చిత్రపరిశ్రమలోకి రావాలనుకున్నాను. ఆ ప్రపంచంలో ఎలా ఉండగలవు ? అని అన్నారు.
నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలనేది నాకు తెలుసు. కానీ ఇప్పటికీ వాళ్లు నా గురించి ఆందోళన చెందుతారు.” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. కామెడీ డ్రామాగా తెరకెక్కిన గుడ్ బై చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. త్వరలోనే రష్మిక పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొనబోతోంది.