రష్మిక మందన్న సౌత్ లోనే కాదు ఇక బాలీవుడ్ లోనూ తన ప్రత్యేకత చాటుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. తెలుగు, కన్నడ సినిమాల్లో ఇప్పటికే టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ… ఇప్పుడు వరుసగా హిందీ సినిమాలను ఒకే చేస్తోంది. ఇటీవలే మిషన్ మంజు అనే బాలీవుడ్ మూవీకి ఒకే చెప్పింది. సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్ యాక్టర్ గా కనిపించనున్న ఈ మూవీని బాగ్చీ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు తన రెండో సినిమాలోనే ఏకంగా అమితాబచ్చన్ తో కలిసే నటించే అవకాశం కొట్టేసింది ఈ కన్నడ హీరోయిన్. వికాస్ భల్ దర్శకత్వంలో తండ్రి-కూతురు సెంటిమెంట్ గా రాబోతున్న సినిమాలో అమితాబ్ కూతురి పాత్రలో నటించనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈమూవీకి డెడ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. 2021 వేసవిలో ఈ మూవీ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.