బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తండ్రి రవి టాండన్ శుక్రవారం మృతి చెందారు. కొన్ని రోజులుగా శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాసవిడిచారు.
కాగా ఆయన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే తండ్రి రవి టాండన్ దహన సంస్కారాలను రవీనా టాండన్ దగ్గరుండి పూర్తి చేశారు.
స్వయంగా తలకొరివి పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తండ్రి మృతిపై రవీనా టాండన్ ఎమోషనల్ గా ఓ లేఖను కూడా విడుదల చేశారు.
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2లో కీలక పాత్రలో నటిస్తుంది.