పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది రీతు వర్మ. ఈ చిత్రం తరువాత కొన్ని సినిమాలు చేసిన ఈ అమ్మడును ఎవ్వరు పట్టించుకోలేదు. తెలుగులో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఆమె కోలీవుడ్ కు షిప్ట్ అయ్యారు. అయితే ఆమెను తెలుగు ప్రేక్షకులు మరిచిపోయే సమయానికి మరోసారి తెలుగు తెరపై కనిపించనుంది.
మరోసారి ఒక్క సినిమాతో ఈ అమ్మడు మాయం అవ్వదు కదా అని అనుకోకండి… ఏకంగా మూడు సినిమాలు చేసే ఛాన్స్ ను కొట్టేసింది. ఇక తెలుగు తెరపై రీతు కనిపించడం జరుగుతుందా అనే సమయానికి ఏకంగా మూడు సినిమాల్లో చేసే అవకాశం పొందడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న టక్ జగదీశ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే బైలింగ్వెల్ చిత్రంలో హీరో శర్వానంద్ సరసన నటించనుంది. తాజాగా మరో యంగ్ హీరో నాగశౌర్య చేస్తోన్న నెక్ట్స్ మూవీలో నటించే ఛాన్స్ ను కూడా రీతూనే కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక మూడు వరుస సినిమాలతో తెలుగు తెరపై తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుందా ..?లేదా అనేది చూడాలి.