మా అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు లభించింది. మరోవైపు విష్ణు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే మంచు విష్ణు ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. కాగా తాజాగా మా ఎన్నికలపై సినీనటి వైసిపి ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి స్పందించారు.
మా మ్యానిఫెస్టో లు చూశాను మా ఎవరు అభివృద్ది చేస్తారు అని నేను భావిస్తానో వారి ప్యానల్ కే నా మద్దతు ఉంటుంది. మా ఎన్నికలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. వివాదాల్లోకి మాత్రం నేను వెళ్ళను అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు రోజా.