గ్లామర్ తో ఇండస్ట్రీని ఏలుతున్న ఈ రోజుల్లో… తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నీ… తన నటనను ఎలివేట్ చేసేవే. కొంటే పిల్లగా అల్లరి చేసే సాయి పల్లవి, తన ఓన్ డబ్బింగ్ తో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది.
అయితే… తన కెరీర్ లో ఇప్పటి వరకు ఓ సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డ అంశాన్ని ప్రస్తావిస్తూ… ఫిదా సినిమాలో ఓ సీన్ ఇబ్బందిపెట్టిందని చెప్పింది. ఫిదా సినిమాలో ట్రాక్టర్ నడిపే సీన్ ఉంటుంది. కానీ తనకు ట్రాక్టర్ నడపటం రాదు. భయాన్ని పైకి కనపడకుండా న్యాచురల్ సీన్ కోసం చాలా కష్టపడ్డానని తెలిపింది ఈ భామ.
ప్రస్తుతం దగ్గుబాటి రానాతో విరాట పర్వం సినిమా చేస్తున్న సాయి పల్లవి… కొద్ది రోజుల్లో శర్వానంద్ సినిమాలో కూడా ఆడి, పాడనుంది.