అందాల భామ సమంతా నటించిన తొలి వెబ్ సిరీస్ విడుదలకు రెడీ అవుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్- సీజన్ 2లో సమంతా విలన్ పాత్రలో నటించింది. ఫిబ్రవరి 12 నుండి అమెజాన్ లో ఈ సిరీస్ విడుదల కానుంది.
అయితే, సమంతా ఏమోజీని ట్విట్టర్ త్వరలో అందుబాటులోకి తీసుకరానుంది. ట్విట్టర్ ఏమోజీని సంపాదించుకున్న ఫస్ట్ ఇండియన్ తార సమంతా కావటం విశేషం. సమంతా నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుంది.
ది ఫ్యామిలీ మ్యాన్- సీజన్ 2కు రాజ్, డీకేలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ వాజ్ పేయి, ప్రియమణి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నేషనల్ ఇన్విస్టిగేటింగ్ ఏజెన్సీ అధికారులుగా వీరు నటిస్తున్నారు.